- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ పరువు, ప్రతిష్టలను పాడు చేస్తున్నానని అమ్మానాన్న తిట్టారు: Naveen Polishetty
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి త్వరలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే మూవీతో రాబోతున్నాడు. సెప్టెంబర్ 7న విడుదల కానున్నటు ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది మూవీ టీం. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ పలు విషయాలను పంచుకున్నాడు.
‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం మా వాళ్లకి అసలు ఇష్టం లేదు. పైగా కుటుంబ పరువు, ప్రతిష్టలను పాడు చేస్తున్నానంటూ నా తల్లిదండ్రులు బాగా తిట్టారు. లక్షల్లో జీతం ఉన్న మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని ఇండస్ట్రీలోకి రావడం వారికి నచ్చలేదు. అలా దాదాపు పది సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. నా మూవీ టైటిల్‌లోనే నా ఇంటి పేరు ఉండటంతో మా నాన్న చాలా సంతోషపడ్డారు. ‘జాతి రత్నాలు’ సినిమాతో మా వాళ్లకి నాపై నమ్మకం కుదిరింది’ అంటూ చెప్పుకొచ్చాడు.