- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కడుపు నిండా తిన్నా అలసటగా ఉంటుందా.. అయితే కారణం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్ : ఏమైనా తినకపోతే నీరసం రావడం అనేది చాలా కామన్. కానీ కొంత మంది కడుపు నిండా తిన్నా కూడా అలసటకు లోను అవుతుంటారు.అయితే దీనికి కారణం విటమిన్ డి లోపమే అంటున్నారు వైద్యులు.
వాస్తవానికి, విటమిన్ డి లేకపోవడం వల్ల, శరీరం యొక్క శక్తి స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీరు చిన్న పని చేసిన తర్వాత కూడా అలసిపోతారంట. శరీరంలో విటమిన్ డి లోపం కారణంగా, మీరు తరచుగా అనారోగ్యానికి గురవ్వడం, కీళ్లు కండరాల నొప్పులు విపరీతంగా ఉంటాయంట. అలాగే విటమిన్ డి లోపం వలన రోగనిరోధక శక్తి తగ్గి ఇది జలుబు, ఫ్లూ, జ్వరం, దగ్గు లాంటి అనేక రకాల ఇన్ఫెక్షన్‌ల ప్రమాదాన్ని పెంచుతుందంట.
అందువలన ఎంత తిన్నా అలసటగా అనిపిస్తుందంట. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు వైద్యులు.