ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. నీ యమ్మ అరై అంటూ.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-15 05:14:01.0  )
ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. నీ యమ్మ అరై అంటూ.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్!
X

దిశ, సినిమా : రామ్ పోతినేని ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ అందింది. ఈ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈరోజు రామ్ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృదం డబుల్ ఇస్మార్ట్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇక ఈ టీజర్‌లో నీ యమ్మ అరై అంటూ.. హైదరబాద్ కుర్రాడి లాంగ్వేజ్‌తో..దిమాకిక్కిరికిరి.. నాకు తెలియకుండా సినిమా ప్లాన్ చేస్తే అనే డైలాగ్‌తో రామ్ తన పాత్రలో ఇరగదీశాడు. ఇస్మార్ట్‌కు మించి ఈ సినిమా ఉండబోతుందని, టీజర్ చూస్తే అర్థం అవుతుంది. డబుల్ మాస్, డబుల్ యాక్షన్.. డబుల్ ఎంటర్టైన్ మెంట్ ఉండేలా సినిమా ఉండబోతుంది అంటున్నారు మూవీ టీం. ఇక ఈ మూవీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సారి రామ్, పూరీ జగన్నాథ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కాగా, మీరు టీజర్‌పై ఓలుక్ వేయండి.

Advertisement

Next Story