Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌తో పాటు గాడిద.. షాక్‌లో ఆడియన్స్ (వీడియో)

by Hamsa |
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌తో పాటు గాడిద..  షాక్‌లో ఆడియన్స్ (వీడియో)
X

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతూ ప్రేక్షకాధరణను పొందుతోంది. బుల్లితెరపై పలు సీజన్లను పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరించడంతో పాటు టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే రాబడుతోంది. అయితే ఇటీవల తెలుగులో సీజన్-8 సెప్టెంబర్ 1న మొదలై ఐదు వారాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు చాలా రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా అయ్యాయి. అలాగే కన్నడ సీజన్-11 కూడా గత వారం స్టార్ట్ అయి ఉత్కంఠగా సాగుతోంది.

తాజాగా, హిందీ బిగ్‌బాస్ సీజన్-18 అక్టోబర్ 6న అట్టహాసంగా ప్రారంభైంది. అయితే ఇందులో భిన్న రంగాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. అలాగే గాడిద కూడా హౌస్‌లోకి అడుగుపెట్టడం గమనార్హం. ఇక అది చూసిన కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. బిగ్‌బాస్ సీజన్ 18లో ప్రముఖ అడ్వకేట్ గుణరత్న సదావర్తే కంటెస్టెంట్‌గా వెళ్లారు. ఆయనతో పాటు అతను పెంపుడు గాడిద మ్యాక్స్‌కు కూడా తీసుకెళ్లారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story