రేణు దేశాయ్‌కి కోట్లలో ఆస్తులున్నాయా.. అవన్నీ ఎలా వచ్చాయి?

by Anjali |   ( Updated:2023-10-19 13:29:12.0  )
రేణు దేశాయ్‌కి కోట్లలో ఆస్తులున్నాయా.. అవన్నీ ఎలా వచ్చాయి?
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ రవితేజ నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రేణు దేశాయ్‌ తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతోపాటు తన ఆదాయం, ఖర్చుల గురించి చెప్పింది. ‘నా ప్రధాన ఆదాయ వనరు రియల్ ఎస్టేట్ వ్యాపారం. మా అమ్మమ్మ, తండ్రి నుంచి ఈ వృత్తిని వారసత్వంగా పొందాను. వారు కూడా ఇదే రంగంలో ఉన్నారు. నాకు హైదరాబాద్, పూణేలలో ఆస్తులున్నాయి. అక్కడే నా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా. ఇక రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చిన డబ్బును నా పిల్లల చదువుల కోసం, అప్పుడప్పుడు సినిమా నిర్మాణం కోసం పెట్టుబడి పెడుతుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story