బాహుబలిలో అనుష్క క్యారెక్టర్‌కు డూప్ చేసింది ఎవరో తెలుసా.. అచ్చం ఆమెలాగే ఉందిగా..!

by sudharani |
బాహుబలిలో అనుష్క క్యారెక్టర్‌కు డూప్ చేసింది ఎవరో తెలుసా.. అచ్చం ఆమెలాగే ఉందిగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ఒకటి ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోయింది. రెండు పార్ట్‌లుగా నిర్మించిన ఈ మ్యూవీలో మొదటి పార్ట్‌లో బానీసగా.. రెండొవ పార్ట్‌లో యువరాణిగా అనుష్క నటనకు మంచి మార్కులు వచ్చాయి.

అయితే ఈ సినిమాలో అనుష్క పాత్రకు డూప్‌గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె కూడా ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ అమ్మడు చూడటానికి అచ్చం అనుష్కాలాగే ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా అనిపిస్తారు. అదే కలర్, అదే హైట్‌తో ఉన్న ఈమె ఎవరో కాదు రుషిక రాజ్. ఈమె అనుష్కకు డూప్‌గానే కాదు బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కూడా అలరించింది. కాగా.. ఈ న్యూస్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story