Ram Charan Upasana దంపతులు రియల్లీ గ్రేట్.. బొడ్డుతాడుతో ట్రెండ్ సెట్ చేశారుగా..!

by sudharani |   ( Updated:2023-07-06 16:36:14.0  )
Ram Charan Upasana దంపతులు రియల్లీ గ్రేట్.. బొడ్డుతాడుతో ట్రెండ్ సెట్ చేశారుగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సెలబ్రిటీలు ఏం చేసినా అది ట్రెండ్‌గా మారుతోంది. దుస్తుల నుంచి స్టైలీస్ వరకు అభిమానులు అన్నీ అనుసరిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు రియల్ లైఫ్‌లో చేసిన ఓ పని తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. ఈ సెలబ్రిటీ దంపతులు చేసింది పూర్వకాలం నుంచి వస్తున్న విధానం అయినా.. నేటి జనరేషన్‌కు ఇది కొత్తదనంగానే కనిపిస్తోంది. ఇంతకూ ఈ మెగా దంపతులు చేసిందేంటంటే తన కూతురు బొడ్డుతాడును భద్రపర్చడం. కాజల్, నమ్రతను ఫాలో అవుతూ ఈ జంట కూడా తమ చిన్నారి బొడ్డుతాడును లక్షల రూపాయల ఖర్చుచేసి ప్రైవేట్ ల్యాబ్‌లో సురక్షితంగా భద్రపరిచారు.

బొడ్డుతాడును ఎందుకు భద్రపరచాలి..?

గర్భంలో తల్లిని బిడ్డని కలిపి ఉంచేది బొడ్డు తాడే. దీని ద్వారానే కడుపులోని శిశువుకు అవసరమైన గ్లూకోజ్, ఆక్సిజన్ అందుతుంది. ఈ బొడ్డు తాడులో ఉండే ధమని, సిరలు బిడ్డని సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సిర నుంచి ఆక్సిజన్ ఇతరాత్ర పోషకాలు అందుతాయి. ధమని శిశువు నుంచి కార్బన్ డయాక్సైడ్‌లను తల్లి రక్త నాళాల్లోకి చేర్చుతుందట. అయితే ప్రసవం తర్వాత బొడ్డు తాడుని తప్పకుండా కత్తిరించాలి. కనీసం రెండు అంగుళాల గ్యాప్‌తో బొడ్డుతాడుని కత్తిరించి దానికి క్లిప్ పెడతారు. కొద్ది రోజుల తర్వాత ఆ బొడ్డు తాడు దానికి అదే ఊడిపోతుంది. ఒకప్పుడు దీన్ని వ్యర్ధంగా భావించి చాలా మంది పారేసేవారు. అయితే బొడ్డు తాడులో ఉండే రక్తంలోని మూలకణాలు బిడ్డ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తాయని తెలిసినప్పటి నుంచి దానిని భద్రపరచడం మొదలు పెట్టారు.

బొడ్డుతాడుతో ఇన్ని రోగాలను నయం చేయవచ్చా..?

బొడ్డు తాడులో ఉండే హెమిటో పొయిటిక్ స్టెమ్ సెల్స్‌లోని మూల కణాలు చాలా ప్రత్యేకమైనవిగా గుర్తించారు. తలసెమియా, లుకేమియా, లింఫ్స్ ఫోమా, మైలోమస్, సీకల్ సెల్ అనేమియా తదితర రక్త సంబంధిత వ్యాధుల చికిత్సకు ఈ మూల కణాలు ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. అంటే భవిష్యత్తులో బిడ్డకు అలాంటి వ్యాధులు ఏమైనా వస్తే మూలకణాల ద్వారా చికిత్స అందిస్తారు. బిడ్డ పుట్టిన వెంటనే వైద్యులు బొడ్డు తాడులోని రక్తని సేకరించి ల్యాబ్‌కు తరలిస్తారు. అక్కడ ప్లాస్మా, డిప్లీషన్ పక్రియ ద్వారా రక్తంలోని ప్లాస్మాను వేరు చేస్తారు. రక్త కణాలను మాత్రమే అతి తక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన కోల్డ్ కంటైనర్‌లో స్టోర్ చేస్తారు. అయితే ఇదంతా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియే. మీ ఆర్థిక స్తోమతను బట్టి బొడ్డు తాడు రక్తాన్ని 25 నుంచి 75 ఏళ్లు భద్రపరుచుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. మీ బిడ్డకు తోబుట్టువులు ఉంటే ఇది చెయ్యాల్సిన అవసరం లేదు.

Read More: వర్షాకాలంలో ఆస్తమా పేషంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే ?

Advertisement

Next Story

Most Viewed