మెగాస్టార్ తన తండ్రితో కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఇదే!

by Anjali |
మెగాస్టార్ తన తండ్రితో కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఇదే!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి గురించి సుపరిచితమే. మెగాస్టార్ అంటే తెలియని సినీ ప్రియులు ఎవరూ ఉండరు. ఈ హీరో డాడీ, ముఠా మేస్త్రి, అన్నయ్య, ఖైదీ నెంబర్ 150, జై చిరంజీవ, ఘరానా మొగుడు, ఇంద్ర, స్టాలిన్, హనుమాన్, హిట్లర్, అల్లుడా మజాకా, అడవి దొంగ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈయన అభిమానుల మనసులను గెలుచుకున్నారు.

విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు - అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఈయన స్టడీ కంప్లీట్ చేశాక పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ సినీ కెరీర్‌ ప్రారంభించాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు పడుతూ.. స్వయం కృషితో టాలీవుడ్ పరిశ్రమలోనే అగ్ర హీరోగా నిలదొక్కుకున్నారు.

ప్రస్తుతం కోట్లాది మంది ప్రేక్షకులను తన ఫ్యాన్స్‌గా మార్చుకున్నాడు. అలాగే తన ఫ్యామిలీ నుంచి.. అన్నయ్య నాగబాబును, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, ఐకాన్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా తమ ఫ్యామిలీని కూడా పరిశ్రమకు పరిచయం చేశారు. అందరికీ మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లో నటించేవారు కేవలం వీరు మాత్రమే ఉన్నారని తెలుసు. కానీ చిరు తండ్రి కొణిదెల వెంకట్రావు కూడా ఓ సినిమాలో నటించారు. పైగా మెగాస్టార్ అండ్ వెంకట్రావు కలిసి ఒకే మూవీలో నటించడం విశేషం. చిరు తండ్రి కేవలం పోలీస్ కానిస్టేబుల్ అని మాత్రమే అందరికీ తెలుసు.

కానీ.. ఈయన బాపు దర్శకత్వంలో ‘మంత్రిగారి వియ్యంకుడు’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో మెగాస్టార్- పూర్ణిమ భాగ్యరాజ్ జంటగా నటించగా.. అల్లు రామలింగయ్య ముఖ్య పాత్రలో కనిపించారు. ఇందులో మంత్రి రోల్‌కు సూట్ అయ్యే యాక్టర్‌ కోసం దర్శకుడు చాలా మందిని అప్రోచ్ అయ్యారట. కానీ ఎవరూ సెట్ కాలేదట. చివరకు రామలింగయ్య.. చిరంజీవి తండ్రి ఉన్నారు కదా? ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దాం అన్నారట. స్క్రీన్ టెస్ట్ చేయగా వెంకట్రావు మంత్రి పాత్రకు అద్భుతంగా సెట్ అయ్యారట. చిరంజీవికి-వెంకట్రావుకు మధ్య ఎలాంటి సీన్స్ లేకపోయినా.. తండ్రికొడుకులు ఒకే సినిమాలో నటించడం ఫ్యాన్స్ ఇన్నాళ్లకు గుర్తుచేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1983లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed