- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోషల్ మీడియాకు దూరంగా ఉండే బాలీవుడ్ యాక్టర్స్ ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా నేటి తరంలో కమ్యూనికేషన్‌కు ప్రధాన వేదికగా మారింది. కమ్యూనికేషన్ తో పాటు గేమ్స్, ఆసక్తి ఉన్న కథనాలు చదవడానికి, కరెంట్ ఇవెంట్స్, న్యూస్ గురించి ఎప్పడికప్పుడు అప్ డేట్ అవ్వడానికి చాలా మంది సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. ఈ జాబితాలో సెలబ్రిటీలు సైతం ముందు వరుసలో ఉంటున్నారు. తమకు సంబంధించిన సినిమాలతో పాటు పర్సనల్ టూర్స్, ఇతరత్రా ఏ సందర్భాన్నైనా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఇందుకు ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్‌లను వేదికలుగా మలుచుకుంటున్నారు. క్షణాల్లో సమాచారం తమను అభిమానించే వారితో పాటు మీడియాకు సైతం చేరుతోంది. కాగా బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా, హీరోయిన్ లుగా వెలుగుతున్న, వెలిగిన కొంత మంది మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నారు. తమకు సంబంధించిన ఏ అంశాన్నైనా ప్రైవేటుగా ఉంచడానికే ఇష్టపడుతున్నారు.
ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ముందు వరుసలో ఉన్నారు. రణ్ బీర్ భార్య హీరోయిన్ ఆలియాభట్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. రణ్ బీర్ కు సంబంధించిన ఏ విషయమైనా ఆయన భార్య ఆలియా, తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొన్ని ఫ్యాన్ క్లబ్ అకౌంట్‌లు రణ్ బీర్‌కు సంబంధించిన అప్ డేట్‌లను సోషల్ మీడియాలో ఉంచుతున్నాయి.
రణ్‌బీర్‌లానే పటౌడీ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంకు దూరంగా ఉంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ భార్య హీరోయిన్ కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కరీనా భర్త సైఫ్‌తో పాటు తన కొడుకులు తైమూర్, జహంగీర్‌లకు సంబంధించిన ఆసక్తికర విషయాలు, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
హీరోయిన్ రాణి ముఖర్జీ సైతం ఇదే బాటలో పయనిస్తున్నారు. రాణి ముఖర్జీ భర్త, ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా సైతం సోషల్ మీడియా ప్లాట్ ఫాంకు దూరంగానే ఉంటున్నారు. 90 దశకానికి చెందిన స్టార్ హీరోయిన్లయిన మాధురి దీక్షిత్, శిల్పశెట్టి, కాజోల్, సుస్మితాసేన్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. రాణి ముఖర్జీ మాత్రం సోషల్ మీడియా తప్పనిసరి కాదని భావిస్తున్నారట.
అలనాటి అందాల తార రేఖ సైతం ప్రైవేట్ లైఫ్‌నే ఇష్టపడతారు. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రేఖ ఉంటే బాగుండు అని ఫీల్ అవుతుంటారు. తన అందం, అభినయం, నటనతో మెప్పించిన అలనాటి సౌందర్యరాశి మాత్రం తన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోకపోవడం విశేషం.
సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ సరసన బాలీవుడ్‌లో మెరవనున్నారు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నయనతార సైతం సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నారు. ఆమెకు సంబంధించిన ఏ విషయమైన భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల వీళ్లిద్దరి పెళ్లి ఫోటోలతో పాటు సరోగసి ద్వారా సంతానం కలిగిన సందర్భంలో విగ్నేష్ ఫోటోలు షేర్ చేశారు. కానీ నయన తార మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను కలిగి ఉండకపోవడం విశేషం.
- Tags
- Bollywood