సింగర్ గీతా మాధురితో విడాకులు.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన భర్త నందు లైవ్‌లో అలా చేయడంతో

by Hamsa |   ( Updated:2024-05-12 14:45:53.0  )
సింగర్ గీతా మాధురితో విడాకులు.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన భర్త నందు లైవ్‌లో అలా చేయడంతో
X

దిశ, సినిమా: టాలీవుడ్ సింగర్ గీతా మాధురి, నటుడు నందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు, కొడుకు కూడా ఉన్నారు. గీతా మాధురి పిల్లలను చూసుకుంటూనే పలు సాంగ్స్ పాడి ప్రేక్షకుల్లో తన క్రేజ్‌ను పెంచుకుంటుంది. అలాగే నందు కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. అయితే గత కొద్ది కాలంగా గీతా మాధురి, నందు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు జోరందుకున్నాయి.

గీతా మాధురి పాటలు పెద్దగా కనిపించకపోవడంతో విడిపోయారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో అలాంటి వార్తలపై గీత, నందు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ విడాకులు వార్తలకు చెక్ పడటం లేదు. వీరు నిజంగానే విడిపోతున్నారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నందు లైవ్‌లో ఆమెతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు.

మీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోతున్నారని ఇటీవల చాలా వార్తలు వచ్చాయి కదా దానికి మీరు ఎలా స్పందిస్తారని యాంకర్ అడగ్గా.. నందు మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చాడు. లైవ్‌లోనే గీతా మాధురికి కాల్ చేసి వారి మధ్య ఎంత ప్రేమ దాగుందో బయటపెట్టాడు. అయితే అప్పుడు ఆమె కార్‌లో ఎక్కడి వెళ్తుండటంతో ముందు వీడియో ఆన్ చేయలేదు నందు చెప్పిన తర్వాత మాట్లాడింది. ఆ తర్వాత నందు మేమిద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తాం అని తెలపడంతో విడాకులు వార్తలకు చెక్ పడినట్లు అయింది. ప్రస్తుతం నందు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Read More...

మొహం మీద అలా అనడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. అవినాష్ షాకింగ్ కామెంట్స్!

Advertisement

Next Story