రజినీకాంత్‌ ఆ మూవీని అంతా గందరగోళం చేశారు.. అందుకే ఫ్లాప్ అంటూ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-07 08:15:57.0  )
రజినీకాంత్‌ ఆ మూవీని అంతా గందరగోళం చేశారు.. అందుకే ఫ్లాప్ అంటూ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రజెంట్ ఆయన ‘వెట్టైయాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, రజినీకాంత్‌పై డైరెక్టర్ కె. ఎస్ రవికుమార్ పలు ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వీరిద్దరి కాంబోలో పలు చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

అయితే 2014లో రజినీకాంత్, రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘లింగ’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇదే విషయంపై ఇన్నాళ్లకు డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకున్నారు. సీజేఐ‌కు నాకు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా సెకండాఫ్ మొత్తాన్ని ఆయనకు నచ్చినట్టు మార్చేశారు. అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు తొలగించారు.

కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయన యాడ్ చేశారు. మొత్తానికి లింగ చిత్రాన్ని గందరగోళం చేశారు. అందుకే అలా జరిగింది కావచ్చు’’ అని చెప్పుకొచ్చారు. అయితే కలెక్షన్ల పరంగా లింగ బాగానే రాబట్టినప్పటికీ సూపర్ హిట్ అందుకోలేకపోయింది. దానికి కారణం రజినీకాంత్ సీన్స్ మార్చడమే అన్నట్లుగా డైరెక్టర్ కామెంట్స్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed