సినిమా జర్నలిస్ట్ పై కోపంతో ఊగిపోయిన నిర్మాత దిల్ రాజు (వీడియో)

by Kavitha |   ( Updated:2024-01-09 06:36:38.0  )
సినిమా జర్నలిస్ట్ పై కోపంతో ఊగిపోయిన నిర్మాత దిల్ రాజు (వీడియో)
X

దిశ, సినిమా : ఇటీవల తన పై వస్తున్న విమర్శలపై ప్రముఖ తెలుగు నిర్మాత దిల్​రాజు తీవ్రంగా స్పందించారు. ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని.. ఇకపై తనపై తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్‌ల తాటతీస్తానని దిల్ రాజు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌​లోని ప్రసాద్​ల్యాబ్‌​లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తాజాగా ఓ సినీ ప్రముకుడి పై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ‘పిచ్చిపిచ్చిగా రాస్తే వదిలిపెట్టను. గుర్తు పెట్టుకోండి. ఏమనుకుంటున్నావ్?’ అంటూ ఆయన మండిపడటం ఈ వీడియో లో కనిపిస్తోంది. అలాగే ‘చిరంజీవి నాపై మాట్లాడిన మాటలు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా’ అంటూ దిల్ రాజు హెచ్చరించారు. అతని ఆపడానికి యత్నించిన మరో వ్యక్తి పై కూడా రాజు ఫైరయ్యారు. ప్రజంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Advertisement

Next Story

Most Viewed