Hero Viraj : ‘బేబీ’ మూవీ క్లైమాక్స్‌లో విరాజ్ సీన్ కట్ చేశారా!

by Prasanna |   ( Updated:2023-07-24 11:07:35.0  )
Hero Viraj  : ‘బేబీ’ మూవీ క్లైమాక్స్‌లో విరాజ్ సీన్ కట్ చేశారా!
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా విడుదలైన ‘బేబి’ వారం దాటినా కూడా అంతే ఊపుతో దూసుకుపోతుంది. ఓ వైపు జోరుగా వానలు పడుతున్నా మరో వైపు ఈ మూవీ హాల్స్‌ నిండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇందులో హీరోగా అనంద్‌తో పాటు విరాజ్ అశ్విన్ కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సాయి రాజేష్ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

మూవీ క్లైమాక్స్‌లో హీరోయిన్ వేరేవాడిని మ్యారేజ్ చేసుకుని మూ అన్ అయినట్లుగా చూపిస్తారు. ఇక హీరో ఆనంద్ మాత్రం హీరోయిన్ ఆలోచనలతో తాగుతూ అలాగే ఉండిపొతాడు. అలా ఇద్దరి క్యారెక్టర్‌లు చూపించాడు దర్శకుడు. కానీ సెకండ్ హీరో విరాజ్‌ను మాత్రం చూపించలేదు. అయితే ఈ ఇంటర్వూలో దర్శకుడు చెప్పుకొచ్చింది ఏమిటంటే.. ‘క్లైమాక్స్‌లో విరాజ్‌కు సంబంధించి కూడా ఒక సీన్ తీశాం. కానీ లెంత్ పరంగా కట్ చేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. అలా చాలా సీన్స్ కట్ చేశామన్న ఆయన అవన్నీ ఓటీటీలో చూపిస్తామన్నాడు.

Read More: చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా ఉంటా: హామీ ఇచ్చిన సూర్య

Advertisement

Next Story