- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యక్షిణిగా వేదిక.. మేకప్ కోసం ఇంత కష్టపడిందా..?
దిశ, సినిమా: ప్రస్తుతం OTT ప్లాట్ ఫామ్‌పై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వెబ్ సిరీస్‌లలో యక్షిణి కూడా ఒకటి. విడుదలకు ముందే ముందు ట్రైలర్, టీజర్ అంచనాలను పెంచేసాయి. మంచు లక్ష్మి, హీరోయిన్ వేదిక జంటగానటించిన ఈ సిరీస్‌కి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఇప్పుడు అందరూ.. ఆ సిరీస్ లోని పాత్రల గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో యక్షిణి పాత్రలో వేదిక నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మనిషి రూపంలో తన శాపానికి విరుగుడు వెతకాలని ప్రయత్నించే అమ్మాయి మాయగా యక్షిణి తన నటనలోని విస్వరూపం చూపించిందనే చెప్పాలి. సుదీర్ఘ విరామం తర్వాత, “యక్షిణి” ఈ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా వేదిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ సిరీస్ లో యక్షిణి పాత్ర కోసం వేదిక ఎంత కష్ట పడిందో వీడియోలో తెలుస్తుంది. మేకప్ వేయడానికి మూడు గంటలు .. తీయడానికి రెండు గంటలు పట్టిందని చెబుతున్నది. మొత్తం ఫెయిరీ లుక్ ఐదు గంటలు పట్టిందని ఆమె మేకప్ వీడియోను రిలీజ్ చేసారు. సెట్ లో ఆమె పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ యక్షిణిలో వేదిక యక్షిణిగా, మంచు లక్ష్మిగా జ్వాలాముఖి, అజయ్, రాహుల్ విజయ్ నటించారు. తేజ మార్ని గతంలో అర్జున్ ఫల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జూన్ 14 నుండి స్ట్రీమ్ అవుతుంది.