సూర్య ‘కంగువ’ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఆ సీన్ సినిమాకే హైలెట్ కానుందట..

by sudharani |   ( Updated:2023-09-30 12:46:56.0  )
సూర్య ‘కంగువ’ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఆ సీన్ సినిమాకే హైలెట్ కానుందట..
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్యకు జోడిగా దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ప్రజెంట్ ఈ సినిమా షూట్ చెన్నైలో జరుగుతుండగా మొసలితో సూర్య క్రేజీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సీన్ సినిమాకు హైలెట్ అవుతుందని తెలుస్తుంది. మొత్తానికి కోలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.

Advertisement

Next Story