- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హనుమాన్’ రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. క్లారిటీ ఇస్తూ ప్రశాంత్ వర్మ పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’. ఇందులో తేజా సజ్జా నటించాడు. అయితే హనుమాన్ సంక్రాంతికి బరిలో జనవరి 12న థియేటర్స్‌లో విడుదలై ఊహించని విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీని మించి హనుమాన్ బ్లార్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా దానికంటే డబుల్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వందల కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే హనుమాన్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత, దర్శకుడికి గొడవలు అయ్యాయని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా, రెమ్యునరేషన్ విషయంలో గొడవలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇండైరెక్ట్‌గా స్పందిస్తూ ట్వీట్ చేశాడు. నిర్మాత, తాను ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోన్‌లో ఏదో చూస్తున్నట్టుగా పోజులు పెట్టారు. ఇలా నెగెటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నాం.. హనుమాన్ స్పిరిట్‌ను కొనసాగిస్తున్నామంటూ’’ రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రెమ్యునరేషన్ విషయంలో గొడవలు వచ్చాయన్న వార్తలు రూమర్లనేనని చెప్పకనే చెప్పేశాడని అంటున్నారు.