చోర్ బజార్ కొత్త పాట.. ఫీల్ గుడ్ లిరిక్స్

by GSrikanth |
చోర్ బజార్ కొత్త పాట.. ఫీల్ గుడ్ లిరిక్స్
X

దిశ, సినిమా : యువ నటుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా జవాన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'చోర్ బజార్'. గెహనా సిప్సీ కథానాయికగా నటించిన సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. చిత్రంలోని కొత్త పాటలను ఈ రోజు సమంత ఆవిష్కరించారు. కాగా 'నూనుగు మీసాల' టైటిల్‌తో రూపొందిన ఈ పాట లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్‌ను హైలైట్ చేస్తుండగా.. సాహిత్యం మంచి అనుభూతిని కలిగిస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలో ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న 'నిరీక్షణ' మూవీ ఫేమ్ అర్చన.. చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed