అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నా: చిత్రాంగద

by Vinod kumar |
అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నా: చిత్రాంగద
X

దిశ, సినిమా: చిత్రాంగద సింగ్ తన కెరీర్‌లో సుదీర్ఘ విరామం తీసుకోవడం గురించి ఓపెన్‌ అయింది. 2005లో వచ్చిన ‘హజారోన్ ఖ్వాహిషేన్ ఐ సి’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటి వరకు కేవలం 10 చిత్రాలలో మాత్రమే కనిపించింది. అయితే సెలెక్టివ్‌గా కథల కోసం వెతుకుతున్న క్రమంలో కాస్త బ్రేక్ ఇచ్చానన్న ఆమె.. ఈ క్రమంలో కొన్ని మంచి ప్రాజెక్ట్‌లను వదులుకున్నందుకు పశ్చాత్తాపపడ్డట్లు చెప్పింది.

‘నాకు కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు ఉన్నాయి. దీంతో నా ఫ్యామిలీ గురించి శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి జీవితంలోనైనా ఏది ముఖ్యమైనదో దాని ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు. నేను అదే చేశానని అనుకుంటున్నా. ప్రేక్షకులు నన్ను ఇంతకాలంగా గుర్తుపెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమె నటించిన తాజా చిత్రం ‘గ్యాస్‌ లైట్‌’ మార్చి 31న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలకానుంది.

Advertisement

Next Story