ఏన్కూర్ లో మన ఊరు మనబడి నిధులు గోల్ మాల్..?

by Aamani |   ( Updated:2025-03-29 07:15:38.0  )
ఏన్కూర్ లో మన ఊరు మనబడి నిధులు గోల్ మాల్..?
X

దిశ, ఏన్కూర్: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మన కందాల్సింది అందుతుంది అన్న సామెతగా, ఇంజనీరింగ్ శాఖ అధికారుల చేతివాటంతో మన ఊరు మనబడి నిధులు నాసిరకం పనులతో గోల్ మాల్ జరిగినట్లు ఆలస్యంగా బయటపడ్డాయి. ఏన్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 300 నుంచి 350 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు నిధులు మంజూరు చేసినట్లే, ఏనుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నిధులు మంజూరు చేయడం జరిగింది. నిధులు ఎంత మంజూరు అయిందో తెలియదు కానీ, అధికారుల దగ్గర్నుంచి తీసుకున్న సమాచారం మేరకు మంచినీటి సరఫరా కోసం రూ, 1,04830, విద్యుత్ లైట్లు ఏర్పాటు, మరమ్మతులు కోసం రూ,5,50598 టీచర్స్ ఫర్నిచర్ కోసం రూ, 65626 మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ కోసం రూ,925216 మంజూరు చేయడం జరిగింది.

ఈ మొత్తం డబ్బులు సంబంధిత ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ అధికారులు కనుసన్నలలో పనులు జరిగితే డబ్బులు సంబంధిత గుత్తేదారికి అందజేయాల్సిన పరిస్థితి ఉంది. పనులు చేసినట్లు రికార్డులో ఉంది. డబ్బులు డ్రా అయినట్టు కూడా సమాచారం. క్షేత్రస్థాయిలో నామమాత్రపు పనులు చేసి డబ్బులు దండుకున్నారని ఆరోపణ బహిరంగ వినిపిస్తున్నాయి. వీటన్నిటికి ప్రధాన కారణం సంబంధిత ఐటిడిఏ ఇంజనీరింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే జరిగిందని స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేదు, విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండి విద్యుత్ సరఫరా జరిగే పైపులు నేలమట్టమై ఉన్నాయి. కనీసం మీటర్ పెట్టే ప్యానల్ బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదంటే నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ఆనాడు మన ఊరు మనబడి కింద మండలంలో జరిగిన అన్ని పాఠశాలలో పనులు నాసిరకంగా జరిగాయని పాఠశాలలో ఆనాడు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాపులు పూర్తిగా పగిలిపోయి విద్యార్థులకు చుక్క నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యం వల్ల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యాయని. జరిగిన పనులపై విజిలెన్స్ నివేదిక తెప్పించుకుని పూర్తిస్థాయిలో విద్యార్థులకు సౌకర్యాలు అందే విధంగా పనులు జరిపించాలని నాసిరకంగా పనులు జరిపించిన సంబంధిత ఇంజనీర్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, గ్రామస్తులు విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.ఈ విషయంపై ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ అధికారులు వివరణ కోరగా, బడ్జెట్ ఎంత కేటాయించారు. ఎన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఎంత డబ్బులు గుత్తేదారులకు బిల్లు చేశారని విషయాన్ని పై అధికారులును అడిగి చెబుతానని చెప్పడం గమనార్హం.

Next Story

Most Viewed