- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న చిరంజీవి ‘భోళా శంకర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి, తమన్న, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. కోలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’ సినిమాకు రిమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇక భారీ అంచనాల నడుమ ఆగస్టు-11 న విడుదలైన ‘భోళా శంకర్’ మొదటి షోలోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని.. బాక్సాఫీస్ వద్దా డిజాస్టర్‌గా నిలిచింది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ‘భోళా శంకర్’ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనాలు రీచ్ కాకపోవడంతో థియేటర్స్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ‘భోళా శంకర్’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్రణాళికలు చేస్తోందట. అయితే.. పెద్ద సినిమా కారణంగా థియేటర్స్‌లో నాలుగు వారాల రన్ ముగిశాకే ఓటీటీలోకి తీసుకురావాలని నిర్మాతల మండలి నిర్ణయించుకుందట. అందుకే ఈ డేట్ ఫైనల్ చేసుకున్నారని సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
Read More: గ్లామర్ మోజులో గాడితప్పినట్లు అనిపిస్తోంది.. రూటు మార్చేస్తానంటున్న జాన్వీ