అన్నయ్యపై పవన్ కల్యాణ్ ప్రశంసలు.. తమ్ముడుకి క్యూట్ రిప్లై ఇచ్చిన చిరంజీవి

by sudharani |
అన్నయ్యపై పవన్ కల్యాణ్ ప్రశంసలు.. తమ్ముడుకి క్యూట్ రిప్లై ఇచ్చిన చిరంజీవి
X

దిశ, సినిమా: తాజాగా మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. 156 చిత్రాలలో 537 పాటల్లో 24 వేల డాన్స్ మూమెంట్స్ చేసినందకు గాను ఈ అరుదైన ఘనత దక్కించుకున్నారు మెగాస్టార్. దీంతో చిరంజీవిపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అన్నయ్యకు దక్కిన అరుదైన గౌరవంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘అన్నయ్య చిరంజీవికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్తకాదు. ఈ రోజు అన్నయ్య పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్స్‌తో అలరించిన నటుడిగా చిరంజీవి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది’ అని ఓ పోస్ట్ పెట్టారు. తాజాగా ఈ పోస్ట్‌పై మెగాస్టార్ చిరంజీవి రిప్లై ఇచ్చారు. ఈ మేరకు ‘థాంక్యూ కల్యాణ్ బాబు’ అని హగ్ ఎమోజీ పెట్టారు. ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Twitter : https://x.com/KChiruTweets/status/1838118604937498772

Next Story

Most Viewed