- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Salman Khan కోసం చరణ్ నుంచి ఖరీదైన సర్‌ప్రైజ్
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. విజయదశమి కానుకగా ఈ నెల 5న భారీ ఎత్తున విడుదలైన చిత్రం తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా.. హిందీలోనూ మంచి వసూళ్లు రాబట్టేందుకు కారణమయ్యారు సల్మాన్. ఇంత చేసినా ఈ సినిమాలో నటించినందుకు తను రెమ్యూనరేషన్ తీసుకునేందుకు నిరాకరించాడని చిరంజీవి సక్సెస్ మీట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో సల్మాన్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారని, ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఇక ముందు నుంచి కూడా సల్మాన్‌కు చిరు ఫ్యామిలితో మంచి అనుబంధం ఉంది. మరి ఈ ఖరీదైన గిఫ్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి : శ్రీవారిని దర్శించుకున్న Anil Ambani, Abhishek Bachchan..