లారెన్స్ ముఖంలో ఉట్టిపడుతున్న రాజసం.. ‘Chandramukhi-2’నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

by samatah |   ( Updated:2023-07-31 08:54:05.0  )
లారెన్స్ ముఖంలో ఉట్టిపడుతున్న రాజసం.. ‘Chandramukhi-2’నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌
X

దిశ, సినిమా:లారెన్స్‌, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. రజనీకాంత్, జ్యోతిక, నయనతారల బిగ్ హిట్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌‌గా వస్తున్న సినిమానుంచి మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటుంది. గణేష్ పండుగ డేట్‌ను లాక్‌ చేసుకుని వస్తున్న మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. రాజు గెటప్‌లో లారెన్స్‌ లుక్‌ అదిరిపోగా ఫేస్‌లో రాజసం ఉట్టి పడేలా ఉంది. ఇక ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్లో వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రాధికా శరత్‌కుమార్‌, వడివేలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై సుభాస్కర‌న్‌ నిర్మిస్తున్నాడు.

Also Read: ప్రభాస్ ‘సలార్’లో మరో బాలీవుడ్ హీరో కీ రోల్?

Advertisement

Next Story