ఆ హీరోయిన్ తో చైతూ షికార్లు.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నSamantha అభిమానులు..

by Hamsa |   ( Updated:2022-11-25 07:52:05.0  )
ఆ హీరోయిన్ తో చైతూ షికార్లు.. దారుణంగా ట్రోల్స్  చేస్తున్నSamantha  అభిమానులు..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్‌ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య ఏదో నడుస్తుంది అన్న రూమర్స్‌ చాలా రోజుల నుంచి మనం వింటున్నవే. ఈ ఇద్దరు ఇప్పటికే తమ మధ్య అలాంటిదేమీ లేదని చాలా సార్లు చెప్పినప్పటికీ.. ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఆ మధ్య శోభితా హైదరాబాద్‌ వచ్చిన సమయంలో మొత్తం చైతూ వెంటే ఉన్నదని, అతను కొత్తగా కడుతున్న ఇంటికి కూడా వెళ్లిందని వార్తలు వచ్చాయి. ఇక ఈ సమయంలో తాజాగా, మరోసారి వీరిద్దరు మళ్లీ కలిసి ఒకే ఫ్రేమ్ లో జంటగా కనిపించడంతో, పుకార్లు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఈ ఫొటో లండన్‌లో దిగినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీ టాక్. ఏదేమైనప్పటికీ, ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ కావడంతో సమంత ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. సామ్‌, చై విడిపోయినప్పుడు అందరూ సమంతనే కారణం అని నిందించారు. ఇప్పుడు చూస్తే చైతన్య మాత్రం బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడని వాళ్లు తిట్టిపోస్తున్నారు.

Read more:

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టు కొట్టిన Masooda Movie

Advertisement

Next Story