ఈ సెలబ్రిటీల విడాకులు.. రామ్ చరణ్ ముందే చెప్పాడు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-20 04:52:03.0  )
ఈ సెలబ్రిటీల విడాకులు.. రామ్ చరణ్ ముందే చెప్పాడు..
X

దిశ, సినిమా: ఈ మధ్య సెలబ్రెటీల విడాకులు కామన్ అయిపోతున్నాయి. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నా ముచ్చటగా మూడేళ్లు కూడా కలిసి ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. నిహారిక - చైతన్య, సమంత - చైతన్య, ఐశ్వర్య - ధనుష్.. ఇలా ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయారు నటాషా - హార్దిక్ పాండ్య. దీంతో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ' ఆరెంజ్ ' సినిమా స్టోరీ లైన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో లవ్ కొంతకాలం మాత్రమే బాగుంటుంది అని చెప్తుంటాడు హీరో రామ్ చరణ్. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రిలీజ్ టైంలో అంతగా క్లిక్ కాకపోయినా.. ఆ తర్వాత మాత్రం చాలా మంది క్లాసిక్ మూవీగా ట్రీట్ చేస్తుంటారు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ టాపిక్ గా అభివర్ణిస్తుంటారు. ఎప్పుడు ఈ సినిమా చూసిన ఫ్రెష్ ఫీల్ కలుగుతుందని చెప్తుంటారు. కాగా మీమర్స్ ప్రస్తుతం ఈ మూవీ స్టిల్స్ యూజ్ చేస్తూ మీమ్స్ తయారు చేస్తున్నారు. లవ్ కొంత కాలమే బాగుంటుందని చరణ్ ఎప్పుడో చెప్పాడని.. ఈ సెలబ్రిటీల విడాకులు అందుకే జరుగుతున్నాయని ట్రెండ్ చేస్తున్నారు.

Story Credit To Kothi Meera Katta Instagram Channel

Advertisement

Next Story

Most Viewed