‘స్కంద’ అభిమానులకు గుడ్ న్యూస్.. సీక్వెల్ అనౌన్స్ చేసిన బోయ‌పాటి

by Hamsa |   ( Updated:2023-09-28 07:00:19.0  )
‘స్కంద’ అభిమానులకు గుడ్ న్యూస్.. సీక్వెల్ అనౌన్స్ చేసిన బోయ‌పాటి
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్, బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక‌లో రూపొందిన సినిమా ‘స్కంద’. శ్రీలీల‌, సాయిమంజ్రేక‌ర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో తెలుగుతో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గురువారం రిలీజైంది. ఇక కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో న‌టించిన రామ్ అభిమానుల‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను కుడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇటు క‌థ రొటీన్‌గానే ఉన్నా.. మాస్ సీన్స్‌, యాక్షన్ ఎపిసోడ్స్‌తో డైరెక్టర్ మెప్పించాడు. త‌మ‌న్ బీజీఎమ్‌ కూడా మంచి ప్లస్ అయింది. ఇదంతా ఒక ఎతైతే సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్‌పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు రామ్‌, బోయ‌పాటి శ్రీను. ‘స్కంద 2’ ఉంటుంద‌ని అనౌన్స్‌చేశారు. దీంతో రామ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Advertisement

Next Story