- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
1987 లో పుట్టినా,ఇంకా నా వయసు 23 ఏళ్లే అంటున్న సమంత.. ఎలాగో తెలుసా..?
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.
ఇక ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోస్ అందరి సరసన నటించి , టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. ఇక తన అందం నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఈముద్దుగుమ్మ ఫిట్ నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటది. కాగా, ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి కొన్ని రోజులు వెకేషన్స్ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని, తర్వాత మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. దీంతో సామ్ చాలా ఒత్తిడికి లోనై, మయోసైటీస్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ అమ్మడు దానిని నుంచి బయట పడటానికి మూవీస్‌కు బ్రేక్ ఇచ్చి, ఈ మధ్య మళ్లీ చిత్రపరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక మయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత సమంత ఎక్కువగా యోగా, వ్యాయామం చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ మధ్య ఎప్పుడూ సామ్ తాను వ్యాయామం చేస్తున్న ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటుంది.ఈ క్రమంలోనే సమంత తన హెల్త్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంది .
అయితే తాజాగా సామ్, ఓ డాక్యుమెంట్ షేర్ చేసింది.అందులో సమంత ఏజ్ 23 ఏళ్లు అని ఉంది. అలాగే వెయిట్ 50 కేజీలంట. దీంతో ఇది చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. 1987లో పుట్టిన సామ్ ఏజ్ 23 ఏంటీ అని ఆలోచనలో మునిగిపోయారు. కానీ ఇది మెటబాలిక్ ఏజ్ అంట. మెటబాలిక్ ఏజ్ అనేది మన బాడీ హెల్త్ ని బట్టి లెక్కిస్తారు. మెటబాలిక్ ఏజ్ తక్కువగా ఉండాలి. అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అంట.