పోలీస్ అధికారిని చూస్తే రక్తం మరుగుతోంది.. మంచు లక్ష్మీ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-03-09 09:56:21.0  )
పోలీస్ అధికారిని చూస్తే రక్తం మరుగుతోంది.. మంచు లక్ష్మీ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ఇటీవల సినిమాలకు కాస్త దూరం అయింది. యూట్యూబ్ చానల్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలో ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. కొద్ది రోజుల క్రిత్రం మంచు మనోజ్ పెళ్లి దగ్గరుండి అన్ని తానై మరీ పెళ్లి ఏర్పాట్లు మంచు లక్ష్మీ చూసుకున్న విషయం తెలిసిందే. ఎంత బీజిగా ఉన్నా పలు విషయాలపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతుంది.తాజాగా, మంచు లక్ష్మీ ఓ షాకింగ్ వీడియో షేర్ చేసింది. అందులో ఓ పోలీస్ అధికారి రాత్రి ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ అమ్మాయి అతని నుండి తప్పించుకుని పోయే ప్రయత్నం చేసినా అతడు ఆమెను వదిలిపెట్టడం లేదు. దీనికి సంబంధించిన వీడియోను మంచు లక్ష్మీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ‘రక్తం మరుగుతోంది’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి : సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన స్టార్ హీరోయిన్.. భారీగా నగదు మాయం!

Advertisement

Next Story