Bigg Boss Season-8: ప్రోమో రిలీజ్.. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్టులకు లిమిటే లేదు (వీడియో)

by Hamsa |
Bigg Boss Season-8: ప్రోమో రిలీజ్..  ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్టులకు లిమిటే లేదు (వీడియో)
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో ఎంతో ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటనను కూడా నాగార్జున విడుదల చేశారు. దీంతో అంతా ఎప్పుడెప్పుడు వస్తుందా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరెవరా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా, బిగ్ బాస్ సీజన్-8 ప్రోమో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్టులకు లిమిటే లేదు. మీరు రెడీగా ఉన్నారా. బిగ్ బాస్ సీజన్-8 ప్రోమో వచ్చేసింది. తొందరలోనే మీ ముందుకు షో వస్తుంది అని రాసుకొచ్చాడు. ఇక ప్రోమోలో అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ వేసిన నాగ్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని చెప్పే డైలాగ్స్ ప్రోమోకు హైలెట్‌గా నిలిచాయి.

Advertisement

Next Story