- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతనికి ఇదే చివరి సిరీస్.. కోహ్లీపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అందరి దృష్టి అతనిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే, కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న విరాట్‌కు ఆసిస్ గడ్డపై ఇదే చివరి సిరీస్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్‌కు ఆసిస్‌లో ఇదే చివరి టెస్టు సిరీస్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.
అలాగే, కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ తిరిగి ఫామ్ అందుకుంటాడని చెప్పాడు. ‘విరాట్ కచ్చితంగా చాంపియన్ బ్యాటర్. గతంలో అతడు ఆసిస్ గడ్డపై విజయవంతమయ్యాడు. 2014లో నాలుగు సెంచరీలు, 2018లో ఒక శతకం చేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టు క్రికెట్ ఆడటం ఇదే చివరిసారి అని అతనికి కూడా తెలుసు. అన్ని రకాలుగా కోహ్లీకి ఇది భారీ సిరీస్. న్యూజిలాండ్ సిరీస్ గురించి ఎక్కువ మాట్లాడానుకోవడం లేదు. పిచ్‌లు బ్యాటింగ్‌ను అనుకూలించలేదు. కానీ, ఆస్ట్రేలియా పరిస్థితులను కోహ్లీ ఆస్వాదిస్తాడు.’ అని చెప్పుకొచ్చాడు.
అలాగే, అదే ఇంటర్వ్యూలో వికెట్ కీపర్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ తర్వాత బెస్ట్ రెడ్ బాల్ బ్యాటర్ పంత్ అని కితాబిచ్చాడు.ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో అతని ఇన్నింగ్స్‌లు చూస్తే.. రెడ్ బాల్ క్రికెట్‌లో పంత్ ఓ జనరేషన్ ప్లేయర్ అని అర్థమవుతుందన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ చాలా ప్రభావం చూపుతాడని జోస్యం చెప్పాడు. తొలి టెస్టులో స్టార్ పేసర్ బుమ్రా జట్టును నడిపిస్తాడన్న వార్తలపై గంగూలీ స్పందిస్తూ.. బుమ్రా మంచి నాయకుడవుతాడని అభిప్రాయపడ్డాడు. అతను గేమ్‌ను చక్కగా అర్థం చేసుకుంటాడని తెలిపాడు.