- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kantaara chapter 1: ‘కాంతారాచాప్టర్1’ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
దిశ, సినిమా: 2022లో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న చిత్రం ‘కాంతార’ (Kantara). కన్నడ (Kannada) నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ (box office) వద్ద పెద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ (Periodic Action Thriller) మూవీని రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా హోంబలే పిలిమ్స్ (Hombale Films) పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు చిత్ర బృందం.
ఈ మేరకు ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు నెట్టింట విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ (First Look Teaser)ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘గతం యొక్క పవిత్ర ప్రతిధ్వనులలోకి అడుగు పెట్టండి’ అనే క్యాప్షన్ ఇచ్చి రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో.. లోయలో ఒంటి నిండా రక్తంతో హీరో కనిపించగా.. బయట నుంచి అగ్నీ రూపంలో ఓ వెలుతురు హీరో కంటిలో పడుతుండగా శక్తివంతమైన రూపంలో కనిపిస్తాడు. ప్రజెంట్ ఈ ఫస్ట్ లుర్ టీజర్ నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.