పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య..

by Aamani |
పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య..
X

దిశ,ధర్మారం: తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని వివాహం చేయడానికి నిర్ణయం తీసుకున్నారనే కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కటికనపల్లి గ్రామంలో జరిగింది. ధర్మారం ఎస్.ఐ తెలిపిన వివరాల ప్రకారం కటికనపల్లి గ్రామంలో కాల్వ సంధ్య 22 సంవత్సరాలు ఉన్నత చదువులు చదువుకోవాలని కోరిక ఉండగా తన తల్లిదండ్రులు ఆమెకు మంచి సంబంధం వచ్చింది అని పెళ్లి అయిన తర్వాత కూడా చదువుకోవచ్చు అని నచ్చచెప్పి బలవంతంగా పెళ్లి నిశ్చయించినారు. కానీ కాల్వ సంధ్యకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఒంటరిగా ఆలోచిస్తూ తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. మృతురాలి తండ్రి కాల్వ కనుకయ్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్.ఐ శీలం.లక్ష్మణ్ తెలిపారు.

Advertisement

Next Story