Maharashtra: మాజీ హోంమంత్రిపై రాళ్ల దాడి.. తలకు తీవ్ర గాయం

by Ramesh Goud |
Maharashtra: మాజీ హోంమంత్రిపై రాళ్ల దాడి.. తలకు తీవ్ర గాయం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర( Maharashtra) మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్(Former Home Minister Anil Deshmukh) పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. మహారాష్ట్రలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు(Elections) ఉండటంతో ఇవ్వాళ ప్రచార పర్వం(Campaign) ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తున్న ఎన్సీపీ శరధ్ పవార్ వర్గం(NCP Sharad Pawar's Faction) నేత అనిల్ దేశ్‌ముఖ్ నాగ్ పూర్ కటోల్(Nagpur's Katol) లో దాడి జరిగింది. కటోల్ నియోజకర్గంలో అనిల్ కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్(Salil Deshmukh) ఇండియా కూటమి(India Alliance) తరుపున పోటీ చేస్తున్నారు.

దీంతో కొడుకుని గెలిపించుకునేందుకు ప్రచారంలో పాల్గొన్న అనిల్ సభలో ప్రసంగించి వెనుదిరిగారు. మార్గమధ్యంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన కారుపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో అనిల్ దేశ్‌ముఖ్ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అవ్వడమే గాక ఆయన తలకు తీవ్ర గాయమైంది. అనంతరం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనపై దాడి చేసింది ఎవరు.. ఎందుకు దాడి చేశారు అనే కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా అనిల్ దేశ్‌ముఖ్ ప్రస్తుతం కటోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన పై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story