Pawan Kalyan: తొలి సమావేశంలోనే టీటీడీ కీలక నిర్ణయం.. స్పందించిన పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |
Pawan Kalyan: తొలి సమావేశంలోనే టీటీడీ కీలక నిర్ణయం.. స్పందించిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ (TTD) పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. తాను కూడా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.

నగర ప్రజల ఆకాంక్షను టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లి పరిశీలించాలని సూచించాను. టీటీడీ తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ బీఆర్ నాయుడుకు, పాలక మండలి సభ్యులకు, ఈవో శ్యామల రావుకు అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed