PM Modi: యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్‌ను కలిసిన ప్రధాని మోడీ

by Mahesh Kanagandla |
PM Modi: యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్‌ను కలిసిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) బ్రెజిల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(US President Joe Biden)ను కలిశారు. రియో డీజెనీరో నగరంలో నిర్వహించిన జీ20 సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సదస్సు కోసమే భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ చేరుకున్నారు. ఇక్కడ పలువురు దేశాధినేతలను కలుసుకున్నారు. ఈ విషయాలను ప్రధాని మోడీ తన ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి దిగిన పిక్‌ను ఆయనకు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బైడెన్‌ను కలవడం ఎప్పటిలాగే సంతోషంగా ఉన్నదని వివరించారు. అదే విధంగా ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్, సింగపూర్ ప్రీమియర్ లారెన్స్ వోంగ్‌లనూ కలిసిన చిత్రాలను ఈ సోషల్ మీడియాలో ప్రధాని షేర్ చేసుకున్నారు. మూడు దేశాల పర్యటన మొదలుపెట్టిన ప్రధాని మోడీ తొలుత నైజీరియాకు వెళ్లారు. అక్కడి నుంచి బ్రెజిల్‌కు చేరుకుని జీ20 సదస్సులో పాల్గొంటున్నారు.

Advertisement

Next Story