‘బిగ్‌బాస్’ సీజన్ 7 టెలికాస్ట్‌ టైమింగ్స్ ఫిక్స్

by Prasanna |   ( Updated:2023-08-27 12:39:39.0  )
‘బిగ్‌బాస్’ సీజన్ 7 టెలికాస్ట్‌ టైమింగ్స్ ఫిక్స్
X

దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు 6 సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకోగా తాజాగా సీజన్ 7 కూడా రాబోతుంది. ఇక ఈ సీజ‌న్ 7 లాంచింగ్ ఈవెంట్‌ ఆదివారం రాత్రి 7 గంట‌ల నుంచి ప్రారంభం కానున్నట్లు స్టార్ మా అనౌన్స్‌ చేసింది. అలాగే ఈ సీజ‌న్‌ టెలికాస్ట్‌ టైమింగ్స్‌ను స్టార్ మా వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుంద‌ని.. శ‌ని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంట‌ల‌కు షో ప్రసార‌మ‌వుతుంద‌ని తెలిపారు. ఇక ఈ సీజ‌న్ 7కు కూడా హోస్ట్‌గా నాగార్జుననే వ్యవ‌హ‌రించ‌బోతుండగా ఈసారి రూ.20 కోట్ల రెమ్యున‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు టాక్. కంప్లీట్‌గా కొత్త రూల్స్‌తో డిజైన్ చేసిన షో ఎలా ఉండబోతుందో చూడాలి.

Advertisement

Next Story