బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. షాక్‌లో హౌస్ మేట్స్.. ఇప్పుడే అసలైన కిక్ వస్తుందంటున్న నెటిజన్లు (వీడియో)

by sudharani |
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. షాక్‌లో హౌస్ మేట్స్.. ఇప్పుడే అసలైన కిక్ వస్తుందంటున్న నెటిజన్లు (వీడియో)
X


దిశ, సినిమా: బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. మూడు వారాలు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. ఇక హౌస్ మేట్స్ కూడా ఎవరికి ఎవరూ తక్కువ కాదు అన్నట్లుగా గేమ్స్‌లో ఇరగదీస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ప్రతి సీజన్‌లో ఇంటికి కెప్టెన్ అయ్యేందుకు గేమ్స్ ఆడించేవారు. కానీ.. ఈ సీజన్ కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ మేకర్స్. ఈ సీజన్‌లో ఇంట్లో కెప్టెన్‌ను నియమించకుండా క్లాన్స్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో హౌస్ మేట్స్ ఈ సారి క్లాన్స్‌కు చీఫ్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు.

ఇక ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. రెండు క్లాన్స్ ఎంపిక కాగా.. శక్తి క్లాన్‌లో నిఖిల్ (చీఫ్), పృథ్వీ, మణికంఠ, యష్మీ గౌడ, సోనియా ఉన్నారు. ఇక కాంతారా క్లాన్‌లో సీత (చీఫ్), విష్ణు ప్రియ, నైనిక, ప్రేరణ, నబీల్, ఆదిత్య ఓం ఉన్నారు. ఇక్కడకు క్లాన్స్ సెలక్షన్ కంప్లీట్ అయ్యాయి. ఇంతలోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్‌కు బిగ్ ట్విస్ట్ ఇస్తాడు. ‘బిగ్ బాస్ హౌస్‌లో మీరు ఊహించని ఓ భూకంపం రాబోతుంది. బిగ్ బాస్ చరిత్రలో 1, 2, 5 కాదు 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. అవి మరో రెండు వారాల్లో రాబోతున్నాయి. అయితే.. మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే పవర్ మీకు ఇస్తున్నారు. కొన్ని చాలెంజెస్ గెలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు’ అంటూ హౌస్ మేట్స్‌కు బిగ్ షాక్ ఇస్తాడు బిగ్ బాస్. ప్రజెంట్ ఈ ప్రోమో వైరల్ కావడంతో.. అసలైన కిక్ ఇప్పుడు మొదలవుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed