తెలంగాణలో 14 జిల్లాలకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్

by M.Rajitha |
తెలంగాణలో 14 జిల్లాలకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని 14 జిల్లాలకు రెండు రోజులపాటు ఎల్లో అలెర్ట్(Yellow Alert) జారీ చేసింది వాతావరణ కేంద్రం. బుధవారం, గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. వాగులు, వంకలు పొంగే అవకాశ, ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పశ్చిమ - మధ్య బంగాళాఖాతం, అలాగే దాని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడడం వల్ల రెండు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 కిమీల నుండి 50కిమీల వేగంతో గాలులు వీయనున్నాయి.

బుధవారం.. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, నిజామాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గురువారం.. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. హైదరాబాద్ నగరంలో కూడా రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది.

Advertisement

Next Story