ప్రజా ప్రతినిధుల పిల్లలను,ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి : జీవన్ రెడ్డి

by Aamani |
ప్రజా ప్రతినిధుల పిల్లలను,ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి : జీవన్ రెడ్డి
X

దిశ,జగిత్యాల టౌన్: ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ విద్యాలయాలు బలోపేతం చేయడం తో పాటు మిగతా వారికి ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఏర్పడుతుందని, అది మన బాధ్యత అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల నిర్వహణ గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన అంశమని, పట్టణ ప్రాంతాల్లో సొంత స్థల సేకరణ పెద్ద సమస్య అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం తోపాటు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలకు అన్ని సొంత భవనాల్లో కొనసాగే విధంగా స్థల సేకరణ చేసి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పలు సమస్యలను పరిశీలించి విద్యార్థులకు తాగునీటి సమస్య, శానిటేషన్ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ తో పాటు చైర్పర్సన్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి,స్థానిక కౌన్సిలర్ గుగ్గిల్ల హరీష్, పిసిసి సెక్రటరీ బండ శంకర్,నాయకులు దేవేందర్ రెడ్డి, దుర్గయ్య, పులి రాము,గుండా మధు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed