- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rishabh Pant : మెరుగైన రిషబ్.. కోహ్లీ, రోహిత్ డౌన్!
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు తన బ్యాటింగ్ శైలితో అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏకంగా6వ స్థానానికి చేరుకున్నాడు. అదే టైంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ ఏకంగా సెంచరీ చేశాడు. ఈ క్రమంలో 731 పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరాడు. అదే సమయంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం మెరుగుపరుచుకొని 751 పాయింట్లతో టాప్-5కి చేరాడు.
ప్రస్తుతం నెంబర్-1 ప్లేస్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్, రెండోస్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, 3వ స్థానంలో డారెల్ మిచేల్, 4వ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ కొనసాగుతున్నారు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా 10, 11వ స్థానాలకు పడిపోయాడు. శుభ్‌మన్ గిల్ 5 ర్యాంకులు మెరుగుపరుచుకుని 14వ స్థానానికి చేరుకున్నారు. ఐసీసీ టెస్టు నెంబర్ వన్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉండగా, బుమ్రా రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు హేజిల్‌వుడ్ మూడో స్థానంలో ఉండగా.. కమ్మిన్స్ 4వ స్థానంలో, టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒకస్థానం మెరుగుపరుచుకొని 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇక వన్డే ర్యాంకింగ్స్ విషయానికొస్తే అఫ్గనిస్థాన్ ఓపెనర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ తొలిసారిగా టాప్-10లో జాబితాలో చోటుదక్కించుకున్నాడు. అతడు ఇటీవల దక్షిణాఫ్రికాపై శతకం బాదిన విషయం తెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో నెం 1 బ్యాటర్‌గా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నిలువగా.. 2వ స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా 3, 4 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.