పరీక్షలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

by Aamani |
పరీక్షలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
X

దిశ, ఆసిఫాబాద్ : అక్టోబర్ 3 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఓపెన్ ఇంటర్,ఎస్ఎస్సీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఆర్డీవో లోకేశ్వర్ రావు తో కలిసి పరీక్షల నిర్వహణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఎస్సీ పరీక్షలకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఇంటర్ పరీక్షల నిర్వహణకు జనకపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఓపెన్ ఎస్ఎస్సీకి 165 మంది, ఇంటర్లో 110 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు,మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 2 విడతలుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేసి 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.

Next Story

Most Viewed