- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చేసుకుందామనుకున్నాం.. కానీ అతడు చనిపోయాడు.. లవ్ స్టోరీ లీక్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
దిశ, సినిమా: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ - 4 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దివి.. తాజాగా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. జోర్దార్ సుజాత హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షోలో దివి తన ప్రేమ కథ బయటపెట్టింది. ‘‘బీటెక్ చదివే రోజుల్లో లవ్ లో పడ్డాను. ఎమ్‌టెక్ వరకు మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నాం. తర్వాత వివాహం చేసుకుందామని అనుకున్నాం. మా ఇద్దరి ఫ్యామిలీస్‌ను కూడా ఒప్పించాం.
ఆల్రెడీ ముహూర్తం కూడా నిర్ణయించారు. కానీ సడన్ గా నేను చేసుకోబోయే అబ్బాయి తమ్ముడు చనిపోయాడు. ఈ కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అలాగే అతడు హైదరాబాదు నుంచి సొంత గ్రామానికి వెళ్లి.. తమ తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు. అతడి కోసం నేను వాళ్ల గ్రామానికెళ్తే నా కెరీర్ స్పాయిల్ అవుతుందని ఆలోచించి.. నాకు బ్రేకప్ చెప్పాడు. కేవలం ఈ కారణంతోనే నాకు బ్రేకప్ చెప్పాడు. ఇలా ఇద్దరం విడిపోయాం. ఈ కారణంతోనే బ్రేకప్ చెప్పాడని తెలిస్తే నేను కచ్చితంగా అతడి కోసం ఊరెళ్లే దాన్ని అంటూ దివి కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.