- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లవి ప్రశాంత్‌తో ఆ పని చేయమన్న ఫ్యాన్.. ఇచ్చిపడేసిన రతిక రోజ్?
దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు బిగ్‌బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. నెగిటివిటీ తో మరింత ఫేమ్ దక్కించుకుంది. ఓ వైపు పల్లవి ప్రశాంత్.. మరోవైపు యావర్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తూ హౌస్‌లో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. కారణం లేకుండానే పల్లవి ప్రశాంత్ పై అరవడం.. తర్వాత మళ్లీ చనువుగా మూవ్ అవ్వడం.. దీంతో ఆడియన్స్ నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇక అనూహ్యంగా నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ మళ్లీ సెకండ్ చాన్స్ ఇచ్చింది. కానీ ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది.
అలాగే హౌస్‌లో ఎక్స్ లవర్ రాహుల్ సిప్లిగంజ్ను మిస్ అవుతున్నట్లు కన్నీరు పెట్టుకుంది. దీంతో నెటిజన్లు రతిక-రాహుల్ సిప్లిగంజ్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ చేశారు. దీనిపై రాహుల్ స్పందించి.. ఫేమ్ దక్కించుకోవడం కోసం ఇతరులను వాడుకోవడం కాదు. సొంత టాలెంట్‌తో పైకి రావాలంటూ రాహుల్ సిప్లిగంజ్.. రతిక రోజ్ పై పరోక్షంగా పెట్టిన పోస్ట్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
తాజాగా రతిక రోజ్ సోషల్ మీడియా వేదికన తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ తో లవ్ ఫ్రాంక్ చేయాలని అడగ్గా.. దీనికి రతిక బదులిస్తూ.. లవ్ ఫ్రాంక్ అర్థం చేసుకునేంత తెలివి వాడికి లేదు. అతడు చాలా సెన్సిటివ్. ఇక ప్రేమ విషయంలో నేను అస్సలు ఫ్రాంక్ చేయను. అని చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రశ్నించగా.. ‘ప్రస్తుతానికి నేను సింగిల్’ అంటూ రతిక రోజ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.