Bharatiyadu 2 : భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్!

by Jakkula Samataha |
Bharatiyadu 2 : భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్!
X

దిశ, సినిమా : సినీ ప్రియులు భారతీయుడు2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసే వారికి బిగ్ షాక్ తగిలింది. కమలహాసన్ కీలక పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ఈ సినిమా ఆగస్టులో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం. కానీ మళ్లీ దీనిపై సందిగ్ధత నెలకొందంట. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ పూర్తిగా చెల్లించేందుకు నిరాకరించి మళ్లీ చర్చలు చేస్తుందంట. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నెట్ ఫ్లిక్స్ భారతీయుడు 2సినిమా మేకర్స్‌తో డీలింగ్ పూర్తి అయిన తర్వాత మూవీ ఓటీటీలోకి రానుంది కాగా, మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటికీ పూర్తిగా క్లారిటీ లేనట్లే.

కాగా, భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా 28 సంవత్సరాల తర్వాత భారతీయు2‌ను తీసుకొచ్చారు. ఈ మూవీని భారీ అంచనాల మధ్యరూ. 250కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, మొత్తంగా రూ.140 కోట్లు మాత్రమే రాబట్టింది. అంతే కాకుండ సినిమాపై నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ 120 కోట్లుకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు సగం ఇస్తాం అంటూ చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed