- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీటీడీ శుభవార్త
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు శుభవార్తను అందించింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. ఇటీవల కాలంలో స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలోనే.. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారని.. తమకు కూడా.. విలువ ఇవ్వాలని విమర్శించారు.
వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో టీటీడీ సభ్యులతో చర్చించారు. ఈ క్రమంలో మెజారిటీ సభ్యులు.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో టీటీడీ బోర్డు.. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయించినట్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఇకపై ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులకు వారానికి రెండు సార్లు.. దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
Read More..