Air Travel: విమాన ప్రయాణికులకు బిగ్ అలెర్ట్..!

by Shamantha N |
Air Travel: విమాన ప్రయాణికులకు బిగ్ అలెర్ట్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: విమాన ప్రయాణాన్ని క్రమబద్ధీకరించాడనికి, భద్రత చర్యలను కఠినతరం చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కఠినమైన ‘‘లగేజ్’’ నిబంధనల్ని(Baggage Restrictions) తీసుకువచ్చింది. హ్యాండ్ లగేజీ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి ఆంక్షలు విధించింది. ప్రయాణికులు ఒక క్యాబిన్ బ్యాగ్ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లేందుకు పరిమితం చేయనున్నారు. విమానాశ్రయాల్లో నానాటికీ ప్రయాణికులు పెరగడంతో నిర్వహణ బాధ్యత, ఆపరేషనల్ ఎఫిషియెన్సీని(Airport Operations) పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలతో భద్రతా తనిఖీ కేంద్రాల దగ్గర ట్రాఫిక్‌ని తగ్గించవచ్చు. ఈ నిబంధనలు ఎయిర్ పోర్టు ఆపరేషనల్స్‌ మరింత సులభతరం చేయనున్నాయి.

బ్యాగేజీ పరిమితులు:

1) ఒక హ్యాండ్ బ్యాగ్ పరిమితి: కొత్త నిబంధనల ప్రకారం, ప్రతీ ప్రయాణికుడు 7 కిలోల కంటే ఎక్కువ బరువు లేని ఒక హ్యాండ్ బ్యాగ్‌ లేదా క్యాబిన్ బ్యాగ్‌ని మాత్రమే తీసుకెళ్లవచ్చు. మిగతా లగేజీలన్నీ చెక్ ఇన్ చేయాల్సిందే

2) క్యాబిన్ బ్యాగ్ సైజు పరిమితులు: క్యాబిన్ బ్యాగ్ పరిమాణం 55 సెం.మీ ఎత్తు, 40 సెం.మీ పొడవు, 20 సెం.మీ వెడల్పు కంటే ఎక్కువ ఉండకూడదు.

3) అదనపు బ్యాగేజీకి సర్‌ఛార్జ్: ప్రయాణికుడు క్యాబిన్ బ్యాగ్ బరువు లేదా పరిమణ పరిమితులను మించి ఉంటే, అప్పుడు అదనపు బ్యాగేజీ ఛార్జ్ ఉంటుంది.

4) ముందు టికెట్ కొనుగోలు చేసిన వారికి మినహాయింపు: 2 మే 2024కి ముందు జారీ చేసిన టిక్కెట్ లకు ఈ లగేజీ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. గతంలో ఉన్న క్యాబిన్ బ్యాగేజీ విధానమే వర్తిస్తుంది.

5) విమానయాన సంస్థలు, ప్రయాణికులపై ప్రభావం: ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రధాన క్యారియర్స్‌తో సహా విమానయాన సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా తన బ్యాగేజీ విధానాలను అప్డేట్ చేశాయి. చివరి నిమిషంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, నిబంధనలు చెక్ చేసుకోవాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed