- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెర్బల్ మందు వికటించి…చికిత్స పొందుతూ మహిళ మృతి
దిశ, వరంగల్ : హెర్బల్ మందు వికటించి ఎంజీఎం ఆస్పత్రిలో గత ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం బాధితురాలు ఎం.యాదలక్ష్మి (40) మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం బోజెరువు గ్రామానికి చెందిన 40 సంవత్సరాల ఎం.యాదలక్ష్మి అనే మహిళ తన భర్తతో విడిపోయి 14 సంవత్సరాల కుమారుడితో ఆమె పుట్టింటి దగ్గరే ఉంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న యాదలక్ష్మి డాక్టరు సలహా మేరకు అలోపతి వైద్యం తీసుకుంటూ మళ్ళీ మూర్చ రాకుండా జీవనం సాగిస్తుంది. ఈ నెల 16వ తేదీన కవిత అనే కిలాడీ లేడీ గ్రామంలో వారి ఇంటికి వచ్చి తాను ఇచ్చే హెర్బల్ మందు ఒక 15 రోజులు వాడితే జీవితాంతం మూర్చ మందులు వాడవలసిన అవసరం ఉండదని నమ్మ పలకడంతో నమ్మిన యాద లక్ష్మి రూ. 3000 చెల్లించి అసలు పేరు లేని మందుని డబ్బాలో కొనుగోలు చేసి కిలాడీ లేడీ కవిత చెప్పినట్లు తాను వాడే మూర్చ మందులు ఆపి 2, 3 రోజులు వాడింది.
ఈ నెల 19వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో పడి ఉన్న యాదలక్ష్మి ని ఎంజీఎం ఆసుపత్రి కి తీసుకురాగా ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ బాలరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌతమ్, కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ బొట్టు మల్లేశ్వర్, పీజీ వైద్యులు డాక్టర్ తిరుపతి ల బృందం పరీక్షించి మూర్చ వ్యాధి తిరగ బడటంతో పాటు పేరు లేని హెర్బల్ మందు వల్ల కిడ్నీ, లివర్ దెబ్బతిని ప్రాణం మీదికి వచ్చిందని తెలిపారు. గత 5 రోజులుగా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందినట్లు ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఘటనపై విచారణ చేసిన టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేష్ కుమార్, వరంగల్ హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ శివ్వా సృజన్ లతో కూడిన బృందం బాధిత మహిళ చికిత్స పొందుతున్న సమయంలో అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రికి వెళ్లి తెలుసుకున్నారు.
సదరు కిలాడీ లేడీ ఇచ్చిన మందు నమూనా సేకరించి ల్యాబ్ పరీక్షకి పంపుతున్నామని తెలిపారు. నాటు వైద్యం, పసరు తో కూడిన చెట్ల వైద్యం, శాస్త్రీయంగా జబ్బుల పట్ల ఎటువంటి అవగాహన లేని ఆర్ఎంపి లతో వైద్యం, ధీర్ఘ కాలిక సమస్యలు అయిన బీపీ, షుగర్, పక్షవాతం, కీళ్ళవాతం, ఇతర సమస్యలకి కొందరు డాక్టర్లు కాకున్నా డాక్టరు అని చెప్పుకుంటూ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఎటువంటి అనుమతి లేని, ఎటువంటి పరిశోధన కూడా చేయకుండా కేవలం ఆహారంలో మార్పులు, వంటింటి చిట్కా లతో మాత్రమే అన్ని రకాల జబ్బులు, క్యాన్సర్లు కూడా తగ్గిపోతాయని అసత్యాలని ప్రచారం చేస్తున్నారని అటువంటి ప్రకటన/పోస్టులు చూసి ఆచరించి కొత్త సమస్యలు కొని తెంచుకొని, ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని డాక్టర్ నరేష్ కుమార్ తెలియ చేశారు.