సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలి

by Naveena |
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు  పరిష్కారించాలి
X

దిశ, అచ్చంపేట : సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని బహుజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల వెంకటేష్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలో జరిగిన సమావేశంలో బహుజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల వెంకటేష్ మాట్లాడుతూ..ఎన్నో రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేయడంతో.. విద్యార్థులకు బోధన అందక వారు నష్టపోతున్నరన్నారు. ఎన్నికలకు ముందు తీరుస్తామని ఇచ్చిన హామీ మేరకు మినిమం టైం స్కేలు, హెల్త్ కార్డులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులను వర్తింపజేయడం వంటి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల దళిత ప్రధానోపాధ్యాయులు అయినా కంబళి రాములుతో అయ్యప్ప స్వాములు బలవంతంగా విద్యార్థి కాళ్ళు మొక్కించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారుమొళ్ళ రవిందర్, నాయకులు శ్రీనివాసులు, భూపతి కుమార్, రంజిత్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed