రోడ్లు లేక.. విద్యార్థులకు తప్పని తిప్పలు

by Jakkula Mamatha |   ( Updated:2024-12-27 11:36:31.0  )
రోడ్లు లేక.. విద్యార్థులకు తప్పని తిప్పలు
X

దిశ,వెబ్‌డెస్క్: గిరిజన ప్రాంతాల్లో పలు రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రాళ్ళూరప్పలతో కనీసం మనుషులు నడవలేని విధంగా తయారయ్యాయి. దీంతో కొండలపై ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. సరైన రోడ్లు లేక పాఠశాలకు వెళ్లాలంటే ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఏపీలోని గిరిజన గ్రామమైన కిడగరికి చెందిన విద్యార్థులు పాఠశాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. పాఠశాలకు చేరుకోవాలంటే ప్రతి రోజు 3 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది. ఈ క్రమంలో విషసర్పాలతో నిండిన దట్టమైన అడవి గుండా విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది పిల్లల్లో విద్యను అభ్యసించాలనే దృఢ నిశ్చయాన్ని తగ్గించేలా కనిపించినప్పటికీ, ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి, తిరిగి వచ్చే ప్రయాణంలో శారీరక శ్రమ, గంటల సంఖ్య వృధా కావడం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed