Lava Yuva 2 5G: మార్బుల్ డిజైన్ తో లావా నుంచి కొత్త 5G ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-27 11:31:47.0  )
Lava Yuva 2 5G: మార్బుల్ డిజైన్ తో లావా నుంచి కొత్త 5G ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశానికి చెందిన ప్రముఖ టెక్ కంపనీ లావా(Lava) కొత్త 5జీ మొబైల్ ను తాజాగా విడుదల చేసింది. లావా యువ 2 5G(Lava Yuva 2 5G) పేరుతో దీన్ని మార్కెట్లో లాంచ్ చేసింది. యూత్(Youth)ను అట్ట్రాక్ట్ చేసేలా ప్రీమియం మార్బుల్ డిజైన్(Marble Design)తో దీన్ని తీసుకొచ్చారు. 4జీబీ+128జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ. 9,499గా కంపెనీ నిర్ణయించింది. మార్బుల్ వైట్, మార్బుల్ బ్లాక్ అనే రెండు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. లావా రిటైల్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ ఫోన్ కొన్న వన్ ఇయర్ లోపు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సర్వీస్ సెంటర్(Service Center)కు వెళ్లాల్సిన పనిలేకుండా నేరుగా కస్టమర్ ఇంటికి వచ్చి ఫ్రీ సర్వీస్(Free Service) అందిస్తారు.

లావా కొత్త 5జీ స్పెసిఫికేషన్స్..

  • 6.67 ఇంచెస్ HD+ పంచ్ హోల్ డిస్‌ప్లేతో ప్రవేశపెట్టారు.
  • 90Hz రిఫ్రెష్ రేట్, 700నిట్స్ హై బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
  • UNISOC T760 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో రన్ అవుతుంది.
  • ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వర్క్ చేస్తుంది.
  • ఇక కెమెరా విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ 50MP AI డ్యూయల్ కెమెరా, 2MP సెన్సార్ కెమెరా ఇచ్చారు.
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అమర్చారు.
  • 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mah బ్యాటరీ కలిగి ఉంటుంది.
  • డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.2, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Advertisement

Next Story

Most Viewed